శేరిలింగంపల్లి జోన్ సిటీ ప్లానర్ ఇంటిపై ఏసీబీ దాడులు… ఆపరేటర్ అత్యుత్సాహమే సీపీ కొంపముంచిందా..? 

నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి చేపలపై అవినీతి నిరోదక శాఖ అధికారులు అకస్మాత్తు దాడులు చేపట్టారు. ఒకేసారి నాలుగు చోట్ల ఏసీబీ దాడులు చేయడంతో టౌన్ ప్లానింగ్ విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ లో టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ అధికారి మెతుకు నర్సింహ రాములు ఇంటి పై గురువారం ఏసీబీ దాడులు జరిపారు. నర్సింహా రాములు నివాసం ఉంటున్న ముసారాంబాగ్ శాలివాహనటౌన్ నగర్ లోని అతని ఇంటిపై, అదేవిధంగా మరో నాలుగు చోట్ల ఏసీబీ దాడులు చేపట్టారు. ఐతే నర్సింహరాములు షిర్డి సాయినాథుని దర్శనానికి వెళ్లినట్టు తెలుస్తుంది.

సిటీ ప్లానర్ నర్సింహా రాములు

కిందిస్థాయి నిర్వాకంతోనే సీపీ బుక్కయ్యారా..? 
ఉదయం జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. పలు ఫైల్స్ స్వాదీనపరుచుకోని సీపీ చాంబర్ ను సీజ్ చేశారు. ఐతే సీపీ వద్ద ఆపరేటర్ గా పనిచేస్తున్న సురేష్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తుంది. సీపీకి తాను ఎంత చెబితే అంత అని, ఎంత పెద్ద పనైనా తనతో అయిపోతుందని పలువురు బిల్డర్లు, ఇళ్ల యజమానుల వద్ద వాయపోయినట్టు సమాచారం. ఏసీబి దాడుల నేపథ్యంలో జోనల్ సీపి కార్యాలయంలో పనిచేసి కింది స్థాయి సిబ్బంది పనితీరు చర్చనీయాంశంగా మారింది. సదరు సిబ్బంది గతంలో పలు నిర్మాన అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఐతే విచారణ పూర్తవుతే తప్ప వాటితో సీపీకి సంబంధం ఉందా లేదా అనేది తెలియనుంది.

సీపీ నర్సింహ రాములు చాంబర్ ను సీజ్ చేసిన దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here