ఇంద్రజాలికుడు డాక్టర్ రాజుకు విశిష్ట “జాదు శిరోమణి” పురస్కారం

  • ఢిల్లీ గడ్డపై శేరిలింగంపల్లి కళాకారుడికి అరుదైన గౌరవం

నమస్తే శేరిలింగంపల్లి: బెల్ ఎంఐజికి చెందిన ప్రముఖ ఇంద్రజాల విన్యాసకులు డాక్టర్ బి.యల్.యన్.రాజు దేశ రాజధానిలో విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. న్యూ ఢిల్లీలో ఈనెల 17,18,19 తేదీలలో నమస్తే డిల్లీ జాదూ ఉత్సవ్ పేరిట అంతర్జాతీయ ఇంద్రజాలికుల సమ్మేళనం నిర్వహించారు. దేశ విదేశాల నుండి సుమారు 300 వందల ఇంద్రజాలికులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి డాక్టర్ బి.యల్.యన్.రాజు పాల్గొని తన అద్భుతమైన ఇంద్రజాల ప్రదర్శనతో సభికులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోని బి.యల్.యన్.రాజుని భారతదేశంలోనే ఇందజాల రంగంలోని అత్యున్నత పురస్కారం జాదూ శిరోమణి అవార్డుతో సత్కరించారు. దేశ వ్యవహారాల మరియూ సాంస్కృతిక శాఖ మంత్రి మీనాక్షి లేఖీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ అశోక్ కర బండా, ఇండియా గ్రేట్ టాలేంట్ ఇయ్యూజినిస్టు బి.యస్.రెడ్డి తదితర ప్రముఖుల చేతుల మీదుగా శాలువా మెమెంటో ప్రశంసా పత్రాలతో డా రాజును సత్కరించారు. గత 37 సంవత్సరాలుగా ఇంద్రజాల రంగంలో డా.రాజు చేస్తున్న కృషిని గుర్తించి జాదూ శిరోమణి అవార్డుకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు మెజీషియన్ లు ఆలీ ప్రదీప్, జె.వి.ఆర్, B.M.గోపాల రెడ్డి, తిరుపతి వెంకటేశ్వర్లు తదితరులు రాజు కు అభినందనలు తెలియజేశారు.

ప్రముఖుల చేతుల మీదుగా జాదు శిరోమణి అవార్డు అందుకుంటున్న డాక్టర్ బిఎల్ఎన్ రాజు

అటు వైద్యం… ఇటు ఇంద్రజాలం…
డా.రాజు వృత్తి రీత్యా వైద్యము అందిస్తూనే ప్రవృత్తి రీత్యా మెజీషియన్ గా రాణిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో స్టార్ మెజీషియన్, మేగా ఎక్స్ లెన్స్ మేజిక్ రత్న, సూర్య చంద్ర సేవాభారతి ఇంద్రజాల పురస్కారం, అబ్దుల్ కలాం జాతీయ అవార్డు, కళారత్న సాంస్కృతిక పురస్కారాలు, విశ్వకళా నంది పురస్కారం, వేదిక తెలుగు నంది నేషనల్ అవార్డు, తెలంగాణ విశ్వ సంస్కృతి నంది పురస్కారం, భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డు, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, గ్రేట్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, క్రియేటివ్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు, అమేజింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, మేజిక్ బుక్ ఆఫ్ రికార్డు లాంటి  అనేక రికార్డులను స్వంతం చేసుకున్నారు.

డాక్టర్ రాజు అందుకున్న జాదు శిరోమణి అవార్డు ఇదే
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here