శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): మేడే సందర్భంగా మియాపూర్ ప్రాంతంలో ఎం ఎ నగర్, స్టాలిన్ నగర్, నడిగడ్డ తాండ, ఓంకార్ నగర్, పిఎన్ నగర్, టిఎన్ నగర్, మియాపూర్ విలేజ్ లలో పార్టీ జెండాలను యం సి పి ఐ (యు)మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ అధ్యక్షతన ఆవిష్కరించారు. మియాపూర్ చౌరస్తా నుండి ఆల్విన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యం సి పి ఐ (యు) గ్రేటర్ కార్యదర్శి వైదమ్ శెట్టి రమేష్, అఖిల భారత కార్మికుల సంఘాల కేంద్రం ( ఎ ఐ సి టి యు) రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ మాట్లాడాడుతూ నేడు కూడా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దేశాలు కార్మిక వర్గాలు, ఉద్యోగ వర్గాలు పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక హక్కులను, చట్టాలను కాలరాసేందుకు అవసరమైన విధానాలను పాటిస్తూ కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత పని గంటల సమయాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని చట్టాలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు.
అసంఘటిత కార్మిక వర్గానికి ఏ విధమైన సామాజిక భద్రత లేదనీ అన్నారు. మేడే స్ఫూర్తిగా పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, కుంభం సుకన్య, తాండ్ర కళావతి, అంగడి పుష్ప, పల్లె మురళి, ఎ ఐ టి యు గ్రేటర్ నాయకులు కర్ర దానయ్య, జి శివాని, పార్టీ డివిజన్ నాయకులు డి మధుసూదన్, ఎండి సుల్తానా బేగం, జి లలిత, డి నరసింహ, రజియా బేగం, రాములు, కే రాజు, శ్రీనివాసులు, ఈశ్వరమ్మ, ఇసాక్, శ్రీనివాస్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.