శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజక వర్గ పరిధిలో ఇజ్జత్ నగర్, ఖానా మెట్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాలలో మేడే ఉత్సవాలను భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు జన సందోహంగా జరుపుకున్నారు. డివిజన్లను ఎరుపు జెండాలతో అలంకరించి సిపిఐ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజక వర్గ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుకొచ్చిందని అదే ఐక్యతతో కార్యకర్తలు కృషి దీక్ష పట్టుదలతో ముందుకు సాగాలని కోరారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదంతో గర్జించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి చందు యాదవ్, ఏఐవైఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు కోన సుధాకర్, పాపి రెడ్డి కాలనీ కార్యదర్శి బట్టు భక్తరాజు, ఏఐటీయూసీ అధ్యక్షుడు తుపాకుల రాములు, డిహెచ్పిఎస్ కార్యదర్శి కొండల్, రఘు ఎం వెంకటేష్, బి నారాయణ, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ప్రెసిడెంట్ ధర్మతేజ, నితీష్, నాయకులు పాల్గొన్నారు.