ఎమ్మెల్యే అనుచరుడి వేధింపులపై చర్యలు తీసుకోవాలి – బిజెపి నాయకుల డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, జ్ఞానేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు రెడ్డి సతీష్ అరోరా ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు అండ దండ లతో వీరమణి అనే మహిళను లైంగికంగా వేదిస్తుండడంతో సతీష్ పై కేసు నమోదుచేసి బాధితులకు న్యాయం చేయాలని బిజెపి నాయకులు హరీష్ రెడ్డి, కాంత్ రావు మద్దతుతో ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, భౌతిక దాడులు నిర్వహించి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిజెపి నాయకుల అక్రమ అరెస్ట్ కు నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని భాగ్యనగర్ కాలనీ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజిత్, నర్సింగ్, నవీన్ గౌడ్, ఏకాంత్ గౌడ్, కల్పన, పర్వతాల్ యాదవ్, శ్రీహరి యాదవ్, నాయకులు, మహిళ కార్యకర్తలను విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేసి ఆక్రమంగా అరెస్ట్ చేసి అక్కడి నుండి మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మియాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంఘీభావం తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిగా వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. రాష్ట్ర నాయకులు యోగానంద్, రవి కుమార్ యాదవ్, నాయకులు రామరాజు, వీర చారి, శ్రీధర్ రావు, రవి గౌడ్, ఆకుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here