నమస్తే శేరిలింగంపల్లి: గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీమ్స్ ఆస్పత్రి వారికి రోగుల రవాణా సౌకర్యార్థం కొమిరిశెట్టి ఫౌండేషన్ నిర్వాహకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా శనివారం అందజేశారు.
అనంతరం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొమిరిశెట్టి ఫౌండేషన్ టిమ్స్ ఆస్పత్రి వారికి అంబులెన్స్ ను అందజేయడం సంతోషకరమన్నారు. కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసిఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం మావంతు సహాయంగా ‘కొమిరిశెట్టి ఫౌండేషన్’ ద్వారా ఆసుపత్రికీ కొత్త అంబులెన్స్ అందజేయడం జరిగిందన్నారు.ఆసుపత్రికి వచ్చే రోగుల రవాణా కోసం వినియోగించుకునేలా అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. కేటీఆర్ పుట్టిన రోజున ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందన్నారు.