నమస్తే శేరిలింగంపల్లి: గురు పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలో గల సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మక్త మహబూబ్ పేటలోని హిందూ స్మశాన వాటికలో ఆర్.కె.వై టీం సభ్యులు ఏర్పాటు చేసిన విశ్రాంత కుర్చీలను రవికుమార్ యాదవ్ ప్రారంభించారు. స్మశాన వాటికలో మొక్కలు నాటారు.
ఆయన వెంట మియాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాఘవేంద్రరావు .శేరిలింగంపల్లి కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎల్లేష్, నాయకులు రమేష్, గుండె గణేష్ ముదిరాజ్, మల్లేష్, జాజిరావు, శ్రీను, రవీందర్, వినోద్ యాదవ్, బాబు ముదిరాజ్, వెంకటేష్, రాము, చంద్ర మాసి రెడ్డి, రామకృష్ణ, కిరణ్, రమేష్, రవీందర్, నరేష్, తదితరులు ఉన్నారు.