నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో 2021-2022 బ్యాచ్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ సాయిబాబా పాల్గొని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థి స్థాయిలోనే క్రమశిక్షణ అలవర్చుకోవాలని, పక్కా ప్రణాళికతో విద్యనభ్యసించి మంచి మార్కులు సాధించాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యాయులు నరహరి, ప్రమోద్ కుమార్, ప్రైమరీ హెడ్మాస్టర్ శ్యామల, గెస్ట్ ఫ్యాకల్టీ మనీ మాధురి, గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, శంకరి రాజు ముదిరాజ్, రమేష్ గౌడ్, బిక్షపతి యాదవ్, ఎల్. వెంకటేష్, ఎస్. పద్మ, హై స్కూల్, ప్రైమరీ స్కూల్ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.