ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది – ఇఫ్తార్ విందులో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, కుల మతాలకు అతీతంగా రంజాన్ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ‌అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్ లో రంజాన్ మాసం పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇప్తార్ విందు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగతో అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం ఉపవాసంతో మంచి తనం, సంస్కారం అలవడుతుందని, మతసామరస్యానికి ప్రతీకగా అందరూ కలిసి జరుపుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, మానిఫెస్టోలో లేని అంశాలను ప్రవేశపెట్టిందన్నారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏటా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేలా మసీదులకు, ఈద్గాలకు అభివృద్ధి, మరమ్మతులకు నిధులు కేటాయించడం, పేద ముస్లింలకు బట్టల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు మిరియాల రాఘవ రావు, అబీబ్, జనార్దన్ రెడ్డి, డి. వెంకటేష్, సుప్రజ ప్రవీణ్, అక్తర్, అక్బర్ ఖాన్, ఓ. వెంకటేష్, మహమ్మద్ బేగ్, యూసఫ్ పాషా, అంజద్ పాషా, అఫ్జల్ ఖాన్, నాగరాజు, భాను, కార్తిక్ గౌడ్, యశ్వంత్, ప్రవీణ్ రెడ్డి, నరేందర్,ఇమ్రాన్, అఫ్సర్, సికెందర్, తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ ‌క్రిస్టల్ గార్డెన్ లో‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here