నీలిమయమైన చందానగర్ – అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచానికి మన రాజ్యాంగం ఆదర్శమని, అందరికి సమానత్వం, అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నతుడు, బడుగు బలహీన‌ వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ స్వంత నిధులతో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు.

చందానగర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ, స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపడంతో పాటు రాజ్యాంగంతో ప్రతి ఒక్కరికి ఓటు అనే ఆయుదాన్ని ఇచ్చిన గొప్ప మేధావి అని అన్నారు. దేశానికి దశ , దిశ చూపిన మహానుభావుడు అని అలాంటి మహానుభావుడిని స్మరించుకుంటూ చందానగర్ లో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని అవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ ‌నడవాలని సూచించారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యమని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరే అని, అదే స్ఫూర్తిగా పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామని‌ ఆరెకపూడి గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రామస్వామి యాదవ్, మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, టిఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు  రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, నాయకులు జరిపేటి జైపాల్, మహిపాల్ యాదవ్, రాజన్, మిరియాల రాఘవ రావు, విమల్ కుమార్, గంధం రాములు, జనార్దన్ రెడ్డి, డి. వెంకటేష్, సుప్రజ ప్రవీణ్, అక్తర్, దొంతి శేఖర్, రఘునాథ్, పీవై రమేష్, అక్బర్ ఖాన్, ఓ. వెంకటేష్, అంజద్ పాషా, నాగరాజు, కార్తిక్ గౌడ్, యశ్వంత్, ప్రవీణ్ రెడ్డి, నరేందర్, అంబేడ్కర్ యూత్ ఫోర్స్ ఛైర్మెన్ విమల్ కుమార్, కంది అశోక్, కంది జ్ఞానేశ్వర్, రాఘవేందర్, నర్సింగరావు, నవీన్, ఉదయ్, అర్జున్, కృష్ణ, నరేందర్, రాజ్ కుమార్, మహేందర్, రవి, రజిని, వరలక్ష్మీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ, వేదికపై పుర ప్రముఖులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here