వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేసింది కేసీఆరే: ఎమ్మెల్సీ కవిత

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వికలాంగులకు అండగా నిలిచి ఆదుకుంది భారాస అధినేత కేసీఆర్ మాత్రమేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అధికారంలోకి రాగానే రూ. 3000 పింఛన్ ను ఇవ్వడంతో పాటు దాన్ని పెంచిన ఘనత కూడా కేసీఆర్ దేనని వెల్లడించారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి వికలాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారికి నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. సామాన్యుల కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం రవీందర్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. వికలాంగులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని చెప్పారు.

కేక్ క‌ట్ చేస్తున్న ఎమ్మెల్సీ క‌విత‌, చిత్రంలో ర‌వీంద‌ర్ యాద‌వ్

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. దివ్యాంగుల సంక్షేమాన్ని చేసి చూపించింది కేవలం కేసీఆర్ మాత్రమేనన్నారు. వికలాంగులు అన్నింట్లోనూ రాణించాలన్నారు. మనోధైర్యంతో ప్రపంచాన్ని జయించే శక్తి వికలాంగులకు ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సాధించిన ఘనతలు ఉన్నాయని గుర్తు చేశారు. భారాస పేదల పక్షాన నిలవడమే కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తోపాటు శేరిలింగంపల్లి నుంచి తరలి వచ్చిన నేతలు, పలువురు వికలాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. వికలాంగులు అన్నింట్లో రాణించాలని, మనోధైర్యంతో ప్రపంచాన్ని జయించే సత్తా ఉందని చెప్పారు. భారాస అధికారంలోకి రాగానే వికలాంగుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలతో కేసీఆర్ అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here