శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): అన్ని వర్గాల ప్రజలను నయ వంచనకు గురి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పాలనను కొనసాగిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. మాదాపూర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధ్యక్షులు, మాదాపూర్ డివిజన్ బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర యాదవ్, జిల్లా ఎస్ టీ మోర్చా ఉపాధ్యక్షుడు సుమన్ సింగ్ నాయక్, జిల్లా కార్యదర్శి ఆనంద్ కుమార్, డివిజన్ బీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గురు యాదవ్, ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్ , బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ నరేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వంశీ కృష్ణా, సీనియర్ నాయకులు తాఖుర్ లాల్ సింగ్, చింటూ, డివిజన్ బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కురుమయ్య, వెంకట్, నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజా అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు.