చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజలను నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ప్రతి రోజూ శివుడికి అభిషేకాలు, ఆకాశ దీపం అర్చన నిర్వహించబడతాయన్నారు. అలాగే కార్తీక సోమవారాల్లో ఉదయం 5 30 నుండి 11 గంటలవరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుందన్నారు. ఈ నెల 29న ఆదివాయం ఉదయం 9 గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.30 గంటలకు జ్వాలా తోరణం జరుగుతుందన్నారు. డిసెంబర్ 7వ తేదీన సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాలింగార్చన పూర్వక అభిషేకం, లక్షబిల్వార్చన జరుపబడుతాయన్నారు. అలాగే కార్తీక మాసంలో నెల రోజుల పాటు శివుడికి గోత్రనామాలతో భక్తులు పూజలు, అభిషేకాలు చేయించుకోవచ్చని సూచించారు. భక్తులు మాస్కులు ధరించి, పరిశుభ్రతతో స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు. ఆలయానికి రాలేని వారు నిర్ణీత రుసుము చెల్లించి తమ గోత్ర నామాలు చెబితే వారి పేరిట అర్చకులు అభిషేకం చేస్తారని తెలిపారు. మరిన్ని వివరాలు ఆలయ ఇన్‌చార్జి ఉమామహేశ్వర్‌ను 9492126990 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని ఆలయ కమిటీ సభ్యులు సూచించారు.