నమస్తే శేరిలింగంపల్లి: కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్తగా, సామాజిక తత్వవేత్తగా, సమసమాజ స్థాపన కోసం ఆహర్నిశలు కృషి చేసిన మహోన్నతుడు మహాత్మ జ్యోతిబా పూలే అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జ్యోతిబా పూలే 195 వ జయంతి వేడుకలను నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు బాపులే చేసిన సేవలు మరవలేనివని, భారత ప్రప్రథమ సామజిక తత్వవేత్త, మొట్టమొదటి సంఘ సంస్కర్త, సమసమాజ స్థాపన కై అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది పూలే అని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. పూలే జీవితం అందరికి మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు.