శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్ చెరు నియోజకవర్గంలోని అమీన్ పూర్ లో సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో కార్పొరేటర్స్ రాగం నాగేందర్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, కుమార్ యాదవ్, ఐలాపూర్ మాణిక్ యాదవ్, సుధాకర్ యాదవ్, రమేష్ యాదవ్, బండారు పాండు రంగారావు యాదవ్, తోకల రాజు యాదవ్ పాల్గొన్నారు. యాదవులు సంఘటితంగా ఉండి విద్య, రాజకీయ రంగాలలో అభ్యున్నతి సాదించాలని, ముఖ్యంగా యువకులు చొరవతో సంస్కృతీ సంప్రదాయాలను పాటించాలని, అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేయాలని నాయకులు అన్నారు. పరస్పర సహకారం తో పనిచేసి జాతి అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.






