కొండాపూర్‌లో వినాయ‌కుడికి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ పూజ‌లు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితి ఉత్సవాల‌ను పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ స‌గర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద పూజ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సయ్యద్ గౌస్, భరత్, తెలంగాణ స‌గర సంఘం అధ్యక్షుడు ఉప్ప‌రి శేఖర్ సాగర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రవి సాగర్, నాయకులు విక్రమ్ చారి, చంద్రకాంత్, శివ గౌడ్, చెన్నయ్య సాగర్, నర్సింహ సాగర్, రవి సాగర్, రాజు సాగర్, సురేష్ సాగర్, సీతారాం సాగర్, మన్యం కొండ సాగర్, శ్రీను సాగర్, ఆంజనేయులు సాగర్, రవీందర్ సాగర్, కృష్ణ సాగర్, నడిపి ఆంజనేయులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.

వినాయ‌కుడి పూజ‌లో పాల్గొన్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, ఉప్ప‌రి శేఖ‌ర్ సాగ‌ర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here