నమస్తే శేరిలింగంపల్లి:దసరా నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, సుభాష్ చంద్రబోస్ నగర్, దోబి ఘాట్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో బతుకమ్మ, దసరా పండగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పండగలకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వర రావు, సంజీవ రెడ్డి, గోకుల్ ప్లాట్స్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు బి.శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ జనరల సెక్రటరీ సాంబశివ రావు, ఏకే.బాలరాజు, జేరిపాటిరాజు, సుభాష్ చంద్రబోస్ నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ముక్తార్, రాజు గౌడ్, ప్రభాకర్, దుర్గా రావు, సాంబయ్య, పితాని శ్రీనివాస్, వెంకట్ రావు, శ్రీనివాస్, రాజేష్, సత్యనారాయణ, రమేష్ రెడ్డి, వెంకటేష్, బుజంగం, సుధాకర్, తిమ్మప్ప, రాములు, వెంకటేష్, కృష్ణ, రంజాన్, కృష్ణ, మల్లేష్, రాందాస్, రామాంజనేయులు, హరి, వార్డు సభ్యులు పితాని లక్ష్మి, మహిళలు లక్ష్మి ప్రసన్న, చంద్రకళ, అనిత, బస్తి మహిళ అధ్యక్షురాలు మొగులమ్మ, శేశిరేఖ, శ్రీజ రెడ్డి, ఉమాదేవి, స్నేహ తదితరులు పాల్గొన్నారు.
