సుర‌భి కాల‌నీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీ పరిసర ప్రాంతలలో డిప్యూటీ కమీషనర్ ముకుంద్ రెడ్డి, వివిధ విభాగాల అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. స్థానికవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కార మార్గాన్ని అందించేలా పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. ముఖ్యంగా రాజీవ్ గృహకల్ప సురభి కాలనీ సరిహద్దులో వర్షాలకు వరద నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందుకు పటిష్టమైన శాశ్వత పరిష్కారం కొరకు ప్రణాళిక సిద్ధం చేయమని సంబంధిత అధికారులకు ఆదేశించారు. డివిజన్ లోని పలు కాలనీలలో, బస్తిల్లో మంచినీటి లోప్రెషర్, సివ‌రేజ్ ఓవర్ ఫ్లో సమస్యల తీవ్రత అధికమయ్యిందని వాటి పరిష్కారానికి జలమండలి అధికారులు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కాల‌నీలో పాద‌యాత్ర చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

బస్తీలోని చెట్ల కొమ్మలకు కీటకాలు చేరి బస్తీ వాసులకు ఇబ్బందికరంగా మారినందువల్ల అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందితో చెట్ల కొమ్మలు తొలగించాలని కార్పొరేటర్ సూచించారు. డివిజన్ పరిధిలోని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారమందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ డిపార్ట్మెంట్ AMHO డాక్టర్ శ్రీకాంత్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్, HMW & SSB మేనేజర్ అభిషేక్ రెడ్డి, తారానగర్ ఎలక్ట్రికల్ సెక్షన్ సబ్ ఇంజనీర్ వరుణ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సురభి కళాకారుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్లు చంద్రశేఖర్, వెంకట్ రెడ్డి, సందయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బస్వరాజ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కోదండరావు, జయకృష్ణ, భాను, జితేంద్ర, యమున, సుధామాలిని, జై శంకర్, గోపికాంత్, వాణి, దుర్గా ప్రసాద్, జిహెచ్ఎంసి సిబ్బంది, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here