శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట్ గ్రామంలో విజయ దశమి మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమానికి ఈ సంవత్సరం వినాయక లడ్డు ప్రసాదం కైవసం చేసుకున్న విజయలక్ష్మి జువలర్స్ అధినేత ములుగు వెంకటేష్ చారి, రవికుమార్ చారి, హరి కుమార్ చారి ముఖ్య అతిథులుగా హాజరై రామ బాణం వేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అనంత్ రామ్ గౌడ్, లక్ష్మయ్య గౌడ్, భీమయ్య, రమేష్ గౌడ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, మన్నే వెంకటేష్, నరేందర్ గౌడ్, గౌతమ్ గౌడ్, సురేందర్ గౌడ్, ఆనంద్ గౌడ్, సాయికుమార్, దేవేందర్, పాండు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.