మాదాపూర్, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో సారీస్ అఫ్ ఇండియా, బతుకమ్మ, దసరా ఉత్సవాలు ముగిశాయి. ప్రముఖ కూచిపూడి నాట్య గురువు అభినయ వాణి నృత్యానికేతన్ బాల త్రిపురసుందరి శిష్య బృందంచే నవదుర్గ కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. దసరా పండుగను పురస్కరించుకొని శిల్పారామం ఆవరణలో జమ్మి పూజ నిర్వహించారు.
తరువాత యాంపీ థియేటర్ లో అజయ్ చక్రవర్తి బృందంచే మహిషాసుర మర్దిని కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొని దసరా పండుగ వేడుకలను తిలకించారు.