శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామం లో రెండవ రోజు స్వాభిమాన్ ఒడియా ఉమెన్స్ వరల్డ్ వారి ఒడియా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ ఫెస్టివల్ సందడిగా సాగింది. శ్రీ సూర్యనారాయణ పాణిగ్రాహి జనరల్ మేనేజర్, ఎన్టీపీసీ, సత్యజిత్ త్రిపాఠి, మేనేజర్ ఐఆర్డిఏ, సునీత జైన్ సైంటిస్ట్, డిఆర్డిఓ, గణేష్ సుభుడి, వైస్ ప్రెసిడెంట్ మైండ్ స్పేస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంబల్పూరి ఫోక్ డాన్స్, పైకా డాన్స్, మయూరభంజ్ ట్రైబల్ మార్షల్ ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒడియా ఫుడ్, చేనేత హస్తకళా ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.