ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలను తక్షణమే ఆదుకోవడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీకి చెందిన దుర్గేష్ ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.60,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఎప్పటికప్పుడు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు కాశీనాథ్ యాదవ్, బోయ కిషన్ పాల్గొన్నారు.