నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్స్ టచ్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, బీజేపీ పార్లమెంట్ ఇంచార్జీ బి. జనార్థన్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించారు. మూడేళ్ల లోపు పిల్లల కోసం ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సతీష్, ప్రిన్సిపాల్ కళ్యాణినాగేంద్రప్రసాద్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి, నాగేశ్వర్ గౌడ్, కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి, శ్రీధర్, నందనం వినయ, మారం వెంకట్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
