శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మంచిర్యాల శ్రీ శర్వాని కూచిపూడి నృత్యాలయంను స్థాపించి ఎందరో కళాకారులకి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తున్న డాక్టర్ భార్గవి ప్రేమ్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. గణేశా కౌతం, జతిస్వరం, దశావతర శబ్దం, హిందోళ తిల్లాన, శివాష్టకం, కృష్ణ శబ్దం, స్వాగతం కృష్ణ, కృష్ణ జనన శబ్దం, స్వల్ల జాతి, కృష్ణ ముకుంద మురారి , మంగళం అంశాలను సాయి సహస్ర, మహన్యా, ఆరాధ్య, అనన్య, లాస్య నందిని, ఆధ్య, స్వస్థిరా, హరిణి, రక్షిత, రిప్సిత, మనస్వి, షెర్విని ప్రదర్శించారు. కళాకారులందరికి ప్రశంస పత్రాలు ఇచ్చి సత్కరించారు.
