నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్‌లోని శ్రీ కనక దుర్గమ్మ దేవాలయం ఆకర్షనీయంగ రూపుదిద్దుకుంది. నిమ్మల మనోహర్ గౌడ్(ఎన్ఎంజీ) ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నిమ్మల సుభద్రా దేవి ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ పనులు ఘనంగా చేపట్టారు. హఫీజ్‌పేట్ ప్రధాన రహదారి మధ్యలో ఉన్న శ్రీ పోచమ్మ దేవాలయం చుట్టురా కొత్తగా టీన్ షెడ్డు నిర్మాణం చేపట్టారు. రక్షణ కోసం గ్రిల్స్, భక్తులను ఆకట్టుకునేలా అమ్మవారి పేరుతో కూడిన లైటింగ్ సైన్‌బోర్డును ఏర్పాటు చేశారు.
అదేవిధంగా స్థానిక టీఆర్ఎస్ నేత ఆర్.మల్లేష్ గౌడ్ సౌజన్యంతో అమ్మవారి గర్భగుడిలో వాల్ టైల్స్, ఫ్లోరింగ్ పనులను పునరుద్ధరించారు. తాజా మార్పులు చేర్పులతో కనక దుర్గమ్మ దేవాలయం కొత్త రూపును సంతరించుకుంది. ఆదివారం జరగనున్న ఆషాడ బోనాలకు ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్ఎంజీ ట్రస్టు కార్యదర్శి నిమ్మల ధాత్రినాథ్ గౌడ్ తెలిపారు. ఆలయాన్ని ఆకర్షనీయంగా మలుచుకునే అవకాశం తమకు లభించడం అదృష్టంగా బావిస్తున్నామని అన్నారు.