జలమండలి‌ అధికారులపై కేసు నమోదు చేయండి – మాదాపూర్ సీఐకి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ ఫిర్యాదు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట్ లో కలుషిత నీటి సరఫరాకు కారణమైన జలమండలి అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మాదాపూర్ సర్కిల్‌ ఇన్ స్పెక్టర్ కు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ‌రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట్ లో కలుషిత నీరు తాగి ఒక వ్యక్తి మరణించగా 100 మంది అస్వస్థతకు గురై కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో‌‌ చికిత్స పొందుతున్నారని అన్నారు. మూడు నెలలుగా కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు అధికారుల దృష్టికితీసుకెళ్లినా స్పందించలేదన్నారు. నగర వాసులకు స్వచ్ఛమైన మంచినీటిని అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పడమే తప్పా చేసింది శూన్యమని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి డాక్టర్ల ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు‌ కారకులైన జలమండలి అధికారులపై కేసు నమోదు చేయాలని సీఐకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, ఎల్లేశ్, మదనాచారి, గోవర్ధన్ రెడ్డి, హరికృష్ణ, ఆనంద్, శివ, గణేష్, శ్రీను, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మాదాపూర్ సీఐకి ఫిర్యాదు చేస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here