గుట్టల బేగంపేట్ బాధితులకు న్యాయం చేయాలి – మృతుని కుటుంబాన్ని పరామర్శించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గుట్టల బేగంపేట్ ప్రజలు మూడు నెలల నుంచి కలుషిత‌ నీటి సరఫరా సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి, జలమండలి అధికారులు దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేదని బిజెపి‌ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట్ లో కలుషిత నీరు తాగి మరణించిన వ్యక్తి కుటుంబాన్ని, అస్వస్థతకు గురైన 14 మంది చిన్న పిల్లల కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం‌ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట్ లో స్థానికులతో కలిసి రవి కుమార్ యాదవ్ సందర్శించారు. కలుషిత నీటి సరఫరాతో మృతిచెందిన కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతికి‌ గల కారణాలను బస్తీ వాసులతో తెలుసుకొని మాదాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి కేసు నమోదు చేయాలని అన్నారు. స్థానిక టిఆర్ఎస్ నాయకులు బస్తీ వాసులను కేస్ ఫైల్ చేయకుండా మాయ మాటలు చెప్పి తప్పుదోవ పట్టించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. జలమండలి అధికారులతో మాట్లాడి నీరు కలుషితం కావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. జలమండలి అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనకు‌‌ ఎవరు‌ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గుట్టల బేగంపేట్ బస్తీవాసులకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటామని హామీనిచ్చారు. సీఎం‌ కేసీఆర్ బాధ్యత తీసుకొని తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని అన్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధా కృష్ణ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, తోట్ల భరత్ కుమార్, హరికృష్ణ, ఆనంద్, శివ, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

కలుషిత నీటిని తాగి మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శిస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here