గిర్ జాతీయ వణ్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించిన ఎంపీలు – ట్విట్టర్ వేదికగా అక్కడి అనుభూతులను పంచుకున్న ఎంపీ సంతోష్ కుమార్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రకృతి నియమాలను గౌరవిస్తే అడవి జంతువులతోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అన్నారు. గుజరాత్ పర్యటనలో పార్లమెంటరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై స్టాండింగ్ కమిటీ పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుంది. స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి స్టడీ టూర్‌లో భాగంగా గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. మల్ధారిస్ గిరిజనుల వద్ద ఎన్నో విషయాలు తెలుసుకున్నామని, ప్రకృతి నియమాలు పాటిస్తే అహ్లాదకరమైన వాతావరణంలో జీవించవచ్చన్నారు. మల్ధారిస్ అనే గిరిజనులతో మమేకమై వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు.ఈ సంచార జాతులు, వారి సంస్కృతి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎంతగానో ఆకట్టుకుందని ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సంగీతం విషయంలో భాష తెలుసుకోవాల్సిన అవసరం లేదని, మల్ధారీలు జానపద పాటలను తమ భాషలో పాడుతున్నప్పుడు వారి ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని, ఇది కాదా రిఫ్రెష్ అంటే అని ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here