నమస్తే శేరిలింగంపల్లి: గుడ్ల ధనలక్ష్మీ ట్రస్ట్ ఛైర్మన్ గుడ్ల ధనలక్ష్మీ చేస్తున్న సేవలను పలువురు ప్రముఖులు అభినందించారు. సోమవారం గుడ్ల ధనలక్ష్మీ ట్రస్ట్ చైర్మన్ ధనలక్ష్మి రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మాజీ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారితో పాటు పలువురు ప్రముఖలను మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి నిత్యావసర సరుకులను అందజేయడం తదితర సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మిని వారు అభినందించారు.