ఫలహార బండి‌ ఊరేగింపులో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పర్వదిన సందర్భంగా ఆదివారం రాత్రి శేరిలింగంపల్లి‌ నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన పలహార బండి ఊరేగింపులో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని‌ ప్రత్యేక పూజలు చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్, సిద్దిక్ నగర్ కాలనీ, మాదాపూర్ గ్రామంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో స్థానికులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, నాయకులు నందు సింగ్ , రమేష్ , గణపతి తదితరులు ఉన్నారు.

ఫలహార బండి ఊరేగింపులో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here