నమస్తే శేరిలింగంపల్లి: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మదీనా గూడ గౌతమి విద్యాక్షేత్ర పాఠశాలలో విద్యార్థులు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థినీవిద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. విద్యార్థులు ఆనందోత్సవాల మధ్య బాలల దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్వేతా రెడ్డి, ప్రిన్సిపల్ శారద తదితరులు పాల్గొన్నారు.
