నమస్తే శేరిలింగంపల్లి:నేటి బాలలే రేపటి పౌరులని, బాల్యంలో నేర్చుకున్నవి జీవితాంతం గుర్తుంటాయని కెనరి ది స్కూల్ చైర్మన్ శ్వేతా రెడ్డి పేర్కొన్నారు. 64వ సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కెనరి ది స్కూల్ లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో విద్యార్థినివిద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కెనెరియన్స్ ఇన్ వండర్ లాండ్ అనే థీమ్ లో భాగంగా నిర్వహించిన ఆర్ట్ మ్యూజిక్, డ్రామా, డ్యాన్స్ వంటి పలు కార్యక్రమాలలో ఆనందోత్సవాలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్వేతా రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత మొదటిసారిగా విద్యార్థులు నేరుగా కలుసుకుని బాలల దినోత్సవాన్ని నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ ప్రసాద్, డైరెక్టర్ సుమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.