శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ విద్యావాణి పాఠశాలలో చేపటాల్సిన నాలా పనులను ఇంజనీరింగ్, హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి, ఇరిగేషన్ శాఖ ఏఈలు, అనిల్ కుమార్ తో కలిసి జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి కాలనీ, బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.