మౌలిక సదుపాయాల కల్పనే‌ ధ్యేయంగా పనిచేస్తాం – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి కాలనీలో, బస్తీలలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ కాలనీలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికమైన పద్ధతిలో యుద్ధప్రాతిపదికన ప్రజలకు మౌలిక వసతులను  మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీసీ రోడ్డు పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, దాసరి ఆంజనేయులు, భీమని శ్రీనివాస్, గోపినగర్ బస్తి కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కలివేముల వీరేశం గౌడ్, రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, బస్వరాజ్ లింగాయత్, దివాకర్ రెడ్డి, ఎం.విజయ్ కుమార్, మోహన్ రెడ్డి, సాయి, వినయ్ గౌడ్, రామ్ చందర్, వర్క్ ఇన్‌స్పెక్టర్, కాంట్రాక్టర్, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

గోపీనగర్ లో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here