శిల్పారామంలో అల‌రించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు

మాదాపూర్, అక్టోబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామం, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్, మినిస్ట్రీ అఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మూడు రోజుల డివిజినల్ లెవెల్ ఫోక్ ఫెస్టివల్ తెలంగాణ జానపద నృత్యాల‌ను ఘనంగా ప్రారంభించారు. శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, సూప‌రింటెండింగ్ ఆర్కియాల‌జిస్ట్ డాక్టర్ సుమితా ఎస్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీపక్ పాటిల్, అకౌంట్స్ ఆఫీసర్ ప్రజాపతి జ్యోతి ప్రజ్వలన చేసి కళాకారులను అభినందించారు. బుధ‌వారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు ఒగ్గు డోలు, డప్పు, పేరిణి, మాధురీ నృత్యాల‌ను ప్రదర్శించారు. మూడు రోజుల ఉత్సవాల‌ను జయప్రదం చేయవలసిందిగా నిర్వాహ‌కులు కోరారు.

డ‌ప్పు నృత్యాల‌తో అల‌రిస్తున్న క‌ళాకారులు

శిల్పారామంలో ద‌స‌రా ఉత్స‌వాలు..

అక్టోబ‌ర్ 3 నుండి 13వ తేదీ వరకు శిల్పారామంలో సారీస్ అఫ్ ఇండియా, బతుకమ్మ, దసరా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. భారతదేశంలోని చేనేత కళాకారులు పోచంపల్లి, గద్వాల్, కోట, మంగళగిరి, పుల్కారి, కాశ్మీరీ, బెంగాలీ కాటన్, పట్టు, బనారసీ పట్టు, బెంగళూరు సిల్క్, చెందేరి, కలంకారీ, కోసం, ముంగా, మస్లిన్, తస్సార్, జాంధానీ, బాందిని మొదలైన పట్టు కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఓణీలు, దుప్పట్లు మొదలైనవి సందర్శకులకు అందుబాటులో ఉంటాయ‌ని అన్నారు. ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. సందర్శకులు అధిక సంఖ్య‌లో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా స్పెషల్ ఆఫీసర్ కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here