శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌతమ్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పిఏసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, చందానగర్ డివిజన్ నాయకుడు రఘునాథ్ రెడ్డి పాల్గొని వికలాంగులకు వీల్ చైర్లు, ఆశా వర్కర్లకు, అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు చీరలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో కాలనీవాసులు, యూత్ అసోసియేషన్, గ్రామస్తులు, బస్తీ వాసులు పాల్గొని గౌతమ్ ని గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






