శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ యం సి పి ఐ (యు )మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సరళా దేవి 14వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎఫ్ డి డబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి పాల్గొని సరళాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సరళా దేవి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా, యంసిపిఐ (యు) కేంద్ర కమిటీ సభ్యురాలిగా పని చేశారని అన్నారు. మియాపూర్ ప్రాంతంలో జరిగిన ఇండ్ల స్థలాల సాధన పోరాటంలో ఎన్నో దాడులు నిర్బంధాలు, జైలు జీవితాన్ని గడిపి అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం పార్టీ ఇచ్చిన పిలుపును ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో విసృతంగా అమలు చేశారని, పార్టీ అభివృద్ధికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకొని దృఢంగా నిలబడి నిజాయితీగా పని చేస్తు చిన్న వయస్సులోనే అమరత్వం పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, సహాయ కార్యదర్శి అనిల్ కుమార్, సభ్యురాలు పి భాగ్యమ్మ, మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, సహాయ కార్యదర్శి పల్లె మురళి, కార్యవర్గ సభ్యులు జి శివాని, డి లక్ష్మి, ఎం.రాణి కీర్తి, రాములు, రమ తదితరులు పాల్గొన్నారు.






