శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో కొంతమేర పెండింగ్ ఉన్న సీసీ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును సరిగ్గా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్, నవీన్, సురేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






