శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌సేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేట్ విలేజ్, సాయి నగర్ కాలనీలలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా ముగియడం సంతృప్తిగా ఉందన్నారు. ఆ గణేషుడి ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్, అష్రాఫ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.