శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ యూత్ అసోసియేషన్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు పూజ చేయబడిన వెండి నాణాన్ని వేలంలో రూ.2.23 లక్షలకు బండారు శ్రీనివాస్ ముదిరాజ్ దక్కించుకున్నారు. లక్కీ డ్రాలో గోల్కొండ రామకృష్ణ వెండి నాణెం గెలిచారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సబ్యులు, మియాపూర్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
