నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేద్దాం: రామస్వామి యాదవ్

  • ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ లో తపస్వి అనాధ శరణాలయంలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ తాడిబోయిన రామస్వామియాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ( పెన్ను, పెన్సిల్, టేబుల్ బుక్, డిక్షనరీ, షార్ప్నర్, ఎరేజర్ ) పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మానవుని సర్వతో ముఖాభివృద్ది విద్య ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో 1965 ప్రపంచ విద్యాశాఖ మంత్రుల సమావేశంలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానం చేశారు. 1966 సెప్టెంబర్ 8వ తేదీ నుండి దానిని అమలు చేస్తున్నారని తెలిపారు. దీని ఉద్దేశం అక్షరాస్యతను పెంచడం, నిరక్షరాస్యులగు పిల్లల్లోనే కాకుండా వయోజనులలోను, వృద్ధులలోనూ అక్షరాస్యతను పెంచి, విద్య మీద కూడా దృష్టి కేంద్రీకరించడమే అన్నారు. ప్రపంచంలో చాలా పెద్ద దేశాలు అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతనే అని నివేదికలు తెలుపుతున్నాయని చెప్పారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు నిరాక్షరస్యత దేశానికి తీరని కళంకము. మన దేశం కూడా అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నది. 75 సంవత్సరాలు క్రితం స్వాతంత్రం వచ్చిన కూడా దేశ అక్షరాస్యత శాతం 77.7 ఉందని, ప్రపంచ సరాసరి అక్షరాస్యత శాతం 86.5 ఉందని అన్నారు. భారతదేశంలో మహిళల అక్షరాస్యత చాలా తక్కువగా ఉందని తెలిపారు. పురుషులు అక్షరాస్యత శాతం 87.7 మహిళల అక్షరాస్యత శాతం 70.3 ఉందని అన్నారు. ముఖ్యంగా దేశంలోని పట్టణ ప్రాంతాలలో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న, గ్రామాలలో మాత్రం చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో అక్షరాస్యత తక్కువగా ఉండడం వల్ల అభివృద్ధి సూచికలో మన దేశం వెనుకబడి ఉంది. 50 సంవత్సరాల పైబడిన వారిలో అక్షరాస్యత తక్కువగా ఉంది.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పండ్లు అందజేస్తున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్

ఎన్ని అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టినా వయోజనులలో అక్షరాస్యతను పెంచడంలో వెనుకబడి ఉన్నాం. 2018లో సాక్షర భారత్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. ఇటీవల కాలంలో వచ్చిన కోవిడ్ విపత్తు కారణంగా అక్షరాస్యతా కార్యక్రమం నిలిచిపోయింది. కావున తిరిగి కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ ను ప్రారంభించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యత పెంచే కార్యక్రమాలను మరింత చురుగ్గా చేపట్టాలి. విద్యావంతులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాల సాధనకు కృషి చేయాలి. అక్షరాస్యత అంటే చదవడం ,రాయడం. చదువు కేవలం ఉద్యోగ సమార్జనకే కాకుండా విజ్ఞానాన్ని, వివేకాన్ని, సంస్కారాన్ని నేర్పుతుందని అన్నారు. మన భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని అన్నారు.

యునెస్కో ప్రతి సంవత్సరం అక్షరాస్యత కార్యక్రమాన్ని ఒక నినాదంతో సూచిస్తారు. ఈ సంవత్సరం కూడా ఒక నినాదం సుచించారు – అక్షరాస్యత అభ్యాస స్థలాలను మంచిగా మార్చడం; అవకాశాలను, సంభావ్యతలను అన్వేషించడం జరుప నిర్ణయింపబడినది. మనమందరం కూడా నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, పాలం శ్రీను, నల్లగొర్ల శ్రీనివాసరావు యాదవ్, నిర్వాహకులు చందు, శాంతి , విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here