శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): సమగ్ర కుల గణన జరపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమగ్ర కుల గణన జరపాలని జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ కులగణన చేపట్టాలని చేసిన ఇన్నేళ్ల తమ పోరాటాలకు ఫలితం దక్కిందని, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడానికి జీవో విడుదల చేయడం శుభ పరిణామమని అన్నారు.

ఈ పోరాటంలో తాము భాగం కావడం చాలా సంతోషంగా ఉందని, సమగ్ర కుల గణన జరిగి అన్ని రంగాలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకుదామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని అన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంకేతం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని బీసీ కుల సంఘాలు నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.