నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడేది లేదని, దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్, మియాపూర్ డివిజన్లలో రూ. 5.93 కోట్లతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్లు మంజులరఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్లు, యూజీడీ పైపులైన్లు, మంజీరా మంచినీటి పైపులైన్ పనులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్, శివాజీ నగర్, గౌతమీ నగర్, వేమన రెడ్డి కాలనీ, కైలాష్ నగర్, విద్యానగర్, శంకర్ నగర్, వేముకుంట, జవహర్ కాలనీ, శంకర్ నగర్ కాలనీ లలో రూ. 3.91 కోట్లతో సీసీ రోడ్లు, యూజీడీ, ఆర్ సీ సీ పైప్ లైన్ నిర్మాణ పనులకు, మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, డాక్టర్ రెడ్డీస్ కాలనీ, మయూరి నగర్, న్యూ కాలనీలలో రూ. రూ. 2.2 కోట్లతో సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ పనులకు ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. మునుపెన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.