శేరిలింగంపల్లి ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

– ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

– రూ. 1కోటి 3లక్షల 75వేలతో అభివృద్ది పనులకు శంకుస్థాపన

మియాపూర్ డివిజన్ పరిధిలో చేపట్టబోయే సిసి రోడ్లు, వరద నీటి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ అరిరెపూడి గాంధీ, ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి: సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ అరెక పూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్, పెబెల్స్ బే అపార్ట్మెంట్స్ వద్ద, MA నగర్ కాలనీ లలో 1 కోటి 3 లక్షల 75 వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ది ఆగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, సీఎం కెసిఆర్ మార్గదర్శకంలో మంత్రి KTR సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిడ్డుతామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణంలో అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారికి చెప్పారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.మియాపూర్ డివిజన్ పరిధిలోని దివ్య శ్రీ శక్తి అపార్ట్మెంట్స్ సమీపంలో రూ. 20 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు
2.మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు సమీపంలోని పెబెల్స్ బే అపార్ట్మెంట్స్ సమీపంలో చిరంజీవి నగర్ నుంచి పటేల్ చెరువు వరకు రూ.51 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే వరద నీటి కాల్వ నిర్మాణ పనులు
3. మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ లో రూ.32.70 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పైన పేర్కొన్న సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here