శేరిలింగంపల్లి, నవంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో కథక్, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. కథక్ నాట్య గురువు సంజుక్త ఘోష్ శిష్య బృందం మొదటగా బెంగాలీ సంస్కృతి సంప్రదాయ రవీంద్రనాథ్ టాగోర్ పాటలకి రవీంద్ర నృత్య ప్రదర్శన, కథక్ నృత్యంలో గురు వందన, శివ స్తోత్రం, శివ తాండవం, జయంతి దేవి చాముండే అంశాలను ఆరాత్రిక, శ్రియ, యశస్వి, రిథమ్, నిషిక, వందన, శుభశ్రీ, శతాబ్ది ప్రదర్శించి మెప్పించారు.
కూచిపూడి నాట్య గురువు ఒగ్గు ప్రవీణ్ శిష్య బృందం తాండవ నృత్యకారి, జతిస్వరం, రామాయణ శబ్దం, మరకత, మండూక శబ్దం, దశావతార శబ్దం, హిందువుల తిల్లాన మొదలైన అంశాలను అతిధి, తారా, కేయ, వేహ, రిష్వ, శ్రీద, కృతి, పూర్వి, ఈషా, దీక్ష ప్రదర్శించి మెప్పించారు.