నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయాలని సీపీఐ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ మేరకు జలమండలి అధికారులకు సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట్, సాయినగర్ తదితర ప్రాంతాల్లో కలుషిత నీటి సరఫరా కావడంతో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రజలందరికీ తాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ హైటెక్ ప్రాంతమైన మాదాపూర్ డివిజన్ లోని డ్రైనేజీతో మంచినీరు సరఫరా కావడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే కమిటీ వేసి బాధితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో శివ, ఎస్. దేవయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.