- సెంటర్‌ను ప్రారంభించిన కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్
కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ లోని ఏరియా హాస్పిటల్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్ లు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా.సృజన, DSO డా.మనోహర్ రాథోడ్, DCHS డా.ఝాన్సీ లక్ష్మి, మెడికల్ సుపరింటెండెంట్ డా.దశరథ్ ల పర్యవేక్షణలో మొదటి విడతలో డాక్టర్లు నాగరాజు, పుల్లారెడ్డిలతోపాటు 30 మంది సిబ్బందికి టీకాలు వేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్ లు మాట్లాడుతూ.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధికి భారతదేశంలో వ్యాక్సిన్‌ను కనిపెట్టడం, అందుకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం వేదిక కావడం గర్వకారణమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మొదటి విడతగా వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని, తెలంగాణలోని ప్రజలందరికీ త్వరలోనే వ్యాక్సిన్ అందుతుందని అన్నారు. వ్యాక్సిన్ పట్ల ఎవరూ అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని, నిరభ్యంతరంగా టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, వార్డు మెంబర్స్ నిర్మల, రూపా రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, జంగంగౌడ్, ఏరియా కమిటీ మెంబర్స్ మంగమ్మ, తిరుపతి యాదవ్, హిమామ్, తెరాస సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, సైబర్ హిల్స్ భాస్కర్ రెడ్డి, లక్ష్మి నారాయణ ముదిరాజ్, బసవయ్య, నందు, గణపతి, డా.రమేష్, గిరిగౌడ్, యాదగిరి, వెంకట్ రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు.
