- తొలి రోజు వ్యాక్సిన్ తీసుకున్న 48 మంది ఆరోగ్య సిబ్బంది
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని హఫీజ్‌పేట ఆరోగ్య కేంద్రంతోపాటు కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లోనూ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి రోజు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మొత్తం కలిపి 48 మందికి టీకా వేశారు.
హఫీజ్‌పేటలో…
హఫీజ్‌పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం 18 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇద్దరు డాక్టర్లు, 4 మంది స్టాఫ్ నర్సులు, 1 సూపర్ వైజర్, 1 ఏఎన్ఎం, 1 ఆశ, 2 అంగన్ వాడీ టీచర్లు, ఇద్దరు హెల్పర్లు, ఇద్దరు ఫార్మసిస్టులు, ముగ్గురు ల్యాబ్ టెక్నిషియన్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్లు రోహిణి, ఉమా దీపికలతోపాటు సిబ్బంది సునీత, కవిత, రాజ్ కుమార్, సంధ్య, మౌనిక, మహేశ్వరి, సంతోష్, రాజేష్, మహేష్, పద్మ, పండరి, శిరీష, పద్మ, సురేఖ, జ్యోతిలకు వ్యాక్సిన్ ఇచ్చారు.
కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్ ల పరిశీలన…
హఫీజ్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్‌లు పరిశీలించారు. వైద్యాధికారి వినయ్ బాబు, నాయకుడు బాలింగ్ యాదగిరి గౌడ్, వార్ సభ్యులు వెంకటేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, సంగారెడ్డి, జమీర్, వెంకట్ రెడ్డి, రమేష్, పాషా పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక బీజేపీ నాయకుడు బోయిని మహేష్ యాదవ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.


కొండాపూర్‌లో…
కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో డాక్టర్లు, సిబ్బంది మొత్తం కలిపి 30 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. డాక్టర్లు కేఎస్ నాగరాజు, జె.కళావతి, ఎ.వరదాచారిలతోపాటు సిబ్బంది టి.బూదమ్మ, జీఎస్ హేమలత, పి.జయమ్మ, జి.ఓంకార్, ఎం.వసంత, పి.ఇందిరా శ్రీలక్ష్మి, బి.శ్రీదేవి, చంద్రయ్య, జి.అంకితా రెడ్డి, టి.రజిని, జి.సుజాత, ఆర్.సుబోధ, బి.అనంత లక్ష్మి, ఎం.సుగంధ సుచిత, ఎం.అనిత, బి.విజయలక్ష్మి, డి.బాలాజీ, బి.చంద్రశేఖర్, జి.కనకయ్య, ఎ.ఆంజనేయులు, షేక్ జహీర్, జి.అకితా రెడ్డి, ఆర్.సత్యనారాయణ, కె.పుల్లారెడ్డి, ఎం.ధనరాజు, మోమిమలి, కె.ప్రమీలలు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి ఎడమ చేతి బొటన వేలిపై సిరా చుక్కను వేశారు.



కాగా శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వ్యాక్సిన్లు ఇంకా సరఫరా కాలేదని, సోమ లేదా మంగళవారాల్లో వ్యాక్సిన్లు వచ్చేందుకు అవకాశం ఉందని, వచ్చిన వెంటనే వైద్యులు, సిబ్బందికి టీకాలను వేస్తామని ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి రాంరెడ్డి తెలిపారు.