నందకుమార్ యాదవ్ కు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కృతజ్ఞతలు

గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ బిజెపి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ఆ పార్టీ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. లింగంపల్లిలోని రెయిన్ ట్రీ అబాడ్ అపార్ట్మెంట్స్ లో శనివారం నందకుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గంగాధర్ రెడ్డి తన గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వాటికి ఎదురొడ్డి తన విజయం కోసం నందకుమార్ యాదవ్ ఎంతో కృషి చేశారని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలు తనకు గెలుపు తో పాటు ఎంతో మంది గొప్ప వ్యక్తులను పరిచయం చేశాయని, సరికొత్త అనుభవాలను పంచాయని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్, రెయిన్ ట్రీ అబాడ్ అపార్ట్మెంట్స్ అధ్యక్షుడు రాఘవేంద్ర, స్థానిక బిజెపి నాయకుడు అందెల కుమార్ యాదవ్, అసోసియేషన్ ప్రతినిధులు గంగాధర్ రెడ్డిని సత్కరించి అభినందనలు తెలిపారు.

కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో నంద కుమార్ యాదవ్, చింతకింది గోవర్ధన్ గౌడ్, రాఘవేంద్ర, కుమార్ యాదవ్ లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here