శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా షేక్‌పేట్ డివిజన్‌లోని ఓయూ కాలనీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా షేక్‌పేట్ డివిజన్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ నాయకులు, స్థానిక నేతలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల బ్రతుకులకు భరోసా నిచ్చిన పార్టీ బీజేపీ అయితే, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. నవంబర్ 11న జరగబోయే ఎన్నికల్లో ప్రజల జీవితాలకు భరోసానిచ్చిన బీజేపీకి మద్దతు తెలుపుతూ, 1వ నంబర్ కమలం గుర్తుకు ఓటు వేసి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

ప్రజలతో మమేకమవుతూ, జనహృదయాలను గెలుచుకుంటూ సాగిన పాదయాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు చేసిన మోసాలను, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల వాటి నిర్లక్ష్య ధోరణిని ప్రజలకు వివరించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే ప్రజలకు అందుబాటులో ఉండే, సేవాభావంతో ఉన్న అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు నిజమైన అభివృద్ధి కోరుకుంటే కమలం గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివసింగ్ రాందీన్, సీనియర్ నాయకులు వసంతకుమార్ యాదవ్, అనిల్ గౌడ్, స్వామి గౌడ్, నరేందర్ యాదవ్, నరసింహరాజు, వరలక్ష్మి, ధీరజ్, అన్సారీ, దినేష్ యాదవ్, రాఘవేంద్ర, మోహన్ రెడ్డి, దుర్గారామ్, బబ్లూ సింగ్, గణేష్ ముదిరాజ్, విజయ్, మహేష్ , స్థానిక బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, బూత్ ఇంచార్జ్‌లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





